Friday, 11 July 2025
  • Home  
  • రైతులకు ఎంత చేసినా తక్కువే
- ఆంధ్రప్రదేశ్

రైతులకు ఎంత చేసినా తక్కువే

నెల్లూరు ,15.05.2020 పున్నమి ✍ రెండో విడత రైతు భరోసాను ప్రారంభించిన ఏపీ సీఎం రైతులకు ఎలా మేలు చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు ఎంత చేసినా తక్కువే అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.   రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండో విడత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, రైతులు, ప్రజాప్రతినిధులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు సీఎం మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.15,500 ఇస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పుడు రూ.5,500 రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. సాధారణ పరిస్థితి ఉంటే ఒక పెద్ద సభ లాగా ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమన్నారు. కరోనా పరిస్థితి వల్ల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నామన్నారు. వ్యవసాయానికి పెట్టబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12,500 చొపమ్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పామన్నారు. ఆ సాయాన్ని పెంచి రూ.15,500 పెట్టుబడి సాయం చేస్తున్నామన్నారు.   రైతు కళ్లలో ఆనందం చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ ఏడాది కూడా మంచి వర్షాలు పడాలని ఆకాంక్షించారు.  సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే.. గతేడాది రూ.6,534 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాం. ఇప్పుడు 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది ఏప్రిల్‌లో రూ.2000, ఇప్పుడు రూ.5,500, అక్టోబర్‌లో రూ.4000, సంక్రాంతికి రూ.2000 కలిపి ప్రతి ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం కౌలు రైతులు, అటవీ అసైన్డ్‌ భూములు సాగు చేస్తున్న వారికి పీఎం కిసాన్‌ నిధి నుంచి రూ.2000 జమ కాలేదని, ఆ డబ్బు కలిపి ఇప్పుడు కౌలు రైతులకు రూ.7,500 జమ చేస్తున్నాం.   పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం నగదు బదిలీ కాకుంటే 1902 కాల్‌సెంటర్‌కు రైతులు ఫోన్‌ చేయవచ్చు ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేసుకునేందుకునే అవకాశం రైతులకు ఎలా మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం రైతులకు నష్టం లేకుండా కౌలు చట్టాన్ఇన తీసుకువచ్చాం ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తాం రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం. ఆర్‌బీకే ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సలహాలు అందిస్తాం ఆర్‌బీకే ద్వారా భూసార పరీక్షలు చేస్తాం వ్యవసాయం, రైతు భరోసా కేంద్రాలకు ప్రత్యేంగా జాయింట్‌ కలెక్టర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. రైతు భరోసా కేంద్రాల్లో 3 రకాల ల్యాబ్‌లు ఉంటాయి. నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ల్యాబ్‌లు ఉంటాయి ఈ-క్రాపింగ్‌ ద్వారా పంట రుణాలు ఇప్పించేలా చర్యలు ఆర్‌బీకే ద్వారా రైతుల పంటలకు ఇన్సురెన్స్‌  గిట్టుబాటు ధర కల్పించడంలో ఆర్‌బీకేలు కీలక పాత్ర పోషిస్తాయి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నాం పొగాకు సమస్య వస్తే వెంటనే మంత్రి కన్నబాబును పంపించి పరిష్కరించాం స్థానికంగానే రైతుల పంటలకు మార్కెంటింగ్‌ అవకాశం కల్పిస్తాం. ఇప్పుడు ఖరీఫ్‌లో నష్టం జరిగితే రబీలో ఇన్సూరెన్స్‌ అందేలా చర్యలు గతంలో పంట నష్టం జరిగితే వెంటనే రైతులకు పరిహారం అందించాం రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు..మిగిలిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది వచ్చే ఏడాది చివరికల్లా వైయస్‌ఆర్‌ జనతా బజార్లు ఏర్పాటు సాగు పరిస్థితులపై రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. పగటి పూటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు 82 శాతం ఫీడర్లను సిద్ధాం చేశాం రబీ నాటికి అందుబాటులో మిగిలిన 18 శాతం ఫీడర్స్‌ సిద్ధం చేస్తాం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం రూ.1500 కోట్లతో ఇప్పటికే రైతుల నుంచి పంట కొనుగోలు చేశాం కరోనా సమయంలోనే వెయ్యి కోట్లు మార్కెంటింగ్‌ జరిగింది. గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 436 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చాం. ఆత్మహత్య చేసుకున్న పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచాం ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవాలని,ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడాలని ఆశిస్తున్నాను. రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతున్నాను.

నెల్లూరు ,15.05.2020 పున్నమి ✍

రెండో విడత రైతు భరోసాను ప్రారంభించిన ఏపీ సీఎం

రైతులకు ఎలా మేలు చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు ఎంత చేసినా తక్కువే అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.  

రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు.

శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండో విడత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు.

అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, రైతులు, ప్రజాప్రతినిధులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.

అంతకుముందు సీఎం మాట్లాడుతూ..

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.15,500 ఇస్తున్నామన్నారు.

అందులో భాగంగా ఇప్పుడు రూ.5,500 రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు.

సాధారణ పరిస్థితి ఉంటే ఒక పెద్ద సభ లాగా

ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమన్నారు.

కరోనా పరిస్థితి వల్ల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నామన్నారు.

వ్యవసాయానికి పెట్టబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12,500 చొపమ్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పామన్నారు.

ఆ సాయాన్ని పెంచి రూ.15,500 పెట్టుబడి సాయం చేస్తున్నామన్నారు.  

రైతు కళ్లలో ఆనందం చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు.

ఈ ఏడాది కూడా మంచి వర్షాలు పడాలని ఆకాంక్షించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

గతేడాది రూ.6,534 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాం. ఇప్పుడు 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది

ఏప్రిల్‌లో రూ.2000, ఇప్పుడు రూ.5,500, అక్టోబర్‌లో రూ.4000, సంక్రాంతికి రూ.2000 కలిపి ప్రతి ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం

కౌలు రైతులు, అటవీ అసైన్డ్‌ భూములు సాగు చేస్తున్న వారికి పీఎం కిసాన్‌ నిధి నుంచి రూ.2000 జమ కాలేదని, ఆ డబ్బు కలిపి ఇప్పుడు కౌలు రైతులకు రూ.7,500 జమ చేస్తున్నాం.  

పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం

నగదు బదిలీ కాకుంటే 1902 కాల్‌సెంటర్‌కు రైతులు ఫోన్‌ చేయవచ్చు

ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేసుకునేందుకునే అవకాశం

రైతులకు ఎలా మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం

రైతులకు నష్టం లేకుండా కౌలు చట్టాన్ఇన తీసుకువచ్చాం

ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తాం

రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం

రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం.

ఆర్‌బీకే ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సలహాలు అందిస్తాం

ఆర్‌బీకే ద్వారా భూసార పరీక్షలు చేస్తాం

వ్యవసాయం, రైతు భరోసా కేంద్రాలకు ప్రత్యేంగా జాయింట్‌ కలెక్టర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం.

రైతు భరోసా కేంద్రాల్లో 3 రకాల ల్యాబ్‌లు ఉంటాయి. నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ల్యాబ్‌లు ఉంటాయి

ఈ-క్రాపింగ్‌ ద్వారా పంట రుణాలు ఇప్పించేలా చర్యలు

ఆర్‌బీకే ద్వారా రైతుల పంటలకు ఇన్సురెన్స్‌ 

గిట్టుబాటు ధర కల్పించడంలో ఆర్‌బీకేలు కీలక పాత్ర పోషిస్తాయి

ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నాం

పొగాకు సమస్య వస్తే వెంటనే మంత్రి కన్నబాబును పంపించి పరిష్కరించాం

స్థానికంగానే రైతుల పంటలకు మార్కెంటింగ్‌ అవకాశం కల్పిస్తాం.

ఇప్పుడు ఖరీఫ్‌లో నష్టం జరిగితే రబీలో ఇన్సూరెన్స్‌ అందేలా చర్యలు

గతంలో పంట నష్టం జరిగితే వెంటనే రైతులకు పరిహారం అందించాం

రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు..మిగిలిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది

వచ్చే ఏడాది చివరికల్లా వైయస్‌ఆర్‌ జనతా బజార్లు ఏర్పాటు

సాగు పరిస్థితులపై రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.

పగటి పూటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు 82 శాతం ఫీడర్లను సిద్ధాం చేశాం

రబీ నాటికి అందుబాటులో మిగిలిన 18 శాతం ఫీడర్స్‌ సిద్ధం చేస్తాం

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం

రూ.1500 కోట్లతో ఇప్పటికే రైతుల నుంచి పంట కొనుగోలు చేశాం

కరోనా సమయంలోనే వెయ్యి కోట్లు మార్కెంటింగ్‌ జరిగింది.

గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 436 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చాం.

ఆత్మహత్య చేసుకున్న పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచాం

ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవాలని,ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడాలని ఆశిస్తున్నాను.

రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతున్నాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.