చింత కానీ / ఖమ్మం
రైతుల అవసరాల కోసం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే ర్యాక్ పాయింట్‌కు బుధవారం 1,265 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు చేరుకున్నాయి. జిల్లా వ్యవసాయ అధికారి (DAO) ధనసరి పుల్లయ్య వివరాలు వెల్లడించారు. ఇందులో 20-20-0-13 రకం ఎరువులు 506 మెట్రిక్ టన్నులు, 28-28-0 రకం ఎరువులు 759 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని మార్క్‌ఫెడ్ ప్రాథమిక కేంద్రాలు, ఎరువుల డీలర్ల దుకాణాలకు ఎరువులను ఇప్పటికే తరలించినట్లు ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని DAO తెలిపారు. రైతులు ఎరువులను సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.



