ఒడిశాలోని రాయరంగ్‌పూర్ పట్టణం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వగ్రామంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఆయుర్వేద మెడికల్ కాలేజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ రెండో క్యాంపస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ ఉపకేంద్రం వంటి పలు విద్యా, వైద్య సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదనంగా క్రీడా సముదాయాలు, ఐటీ పార్కులు, విమానాశ్రయ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు కూడా ప్రతిపాదించబడ్డాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టుల్లో కొన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ చర్యలు రాయరంగ్‌పూర్‌ను విద్యా, వైద్య, పారిశ్రామిక కేంద్రంగా మార్చనున్నాయని భావిస్తున్నారు.

రాష్ట్రపతి స్వగ్రామం రాయరంగ్‌పూర్‌కు అభివృద్ధి వరాలు