రాయలసీమ హార్టికల్చర్ హబ్’.. సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి
పలమనేరు, అక్టోబర్ 01 ( పున్నమి ప్రతినిధి) :
మదనపల్లె వేదికగా ఒక భారీ ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ. లక్ష కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ‘రాయలసీమ హార్టికల్చర్ హబ్’ శంకుస్థాపన కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటోంది. ఇందులో భాగంగా శంకుస్థాపన జరగనున్న సభా ప్రాంగణాన్ని, ఇతర ఏర్పాట్లను పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రోగ్రామ్ పరిశీలకులు దామచర్ల సత్య, అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. సీఎం, కేంద్ర మంత్రి రాక నేపథ్యంలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సభకు వచ్చే రైతులకు మరియు ప్రజలకు కల్పించాల్సిన వసతులపై అధికారులకు మంత్రులు, ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు.
Uploaded Video:



