Friday, 2 October 2026
  • Home  
  • రాయలసీమ హార్టికల్చర్ హబ్కు మద్దతుగా భారీ ట్రాక్టర్ ర్యాలీ
- కడప

రాయలసీమ హార్టికల్చర్ హబ్కు మద్దతుగా భారీ ట్రాక్టర్ ర్యాలీ

రాయలసీమ భవిష్యత్ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన రూ.1 లక్ష కోట్ల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ‘రాయలసీమ హార్టికల్చర్ హబ్’ అభివృద్ధికి మద్దతుగా జమ్మలమడుగు నియోజకవర్గ రైతుల ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతుల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ఈ ర్యాలీ చేపట్టారు.బుధవారం ఉదయం 10 గంటలకు కొండాపురం మండల కేంద్రం నుంచి ర్యాలీ ప్రారంభమై ముద్దనూరు మండలంలోని ఓబులాపురం గ్రామం వరకు కొనసాగింది. అనంతరం ఓబులాపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ర్యాలీ ముగిసింది. సుమారు 200 ట్రాక్టర్లతో నిర్వహించిన ఈ ర్యాలీ లో జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఉద్యానవన రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమలో రైతులు సాగు చేస్తున్న ఉద్యాన పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, నిల్వ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి వస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. “రాయలసీమ హార్టికల్చర్ హబ్’ ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని, రైతుల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి భూపేష్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ అభివృద్దిలో రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. రైతుల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని “రాయలసీమ హార్టికల్చర్ హబ్’ అభివృద్ధికి మద్దతుగా ఈ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యాన వంటల సాగును మరింత ప్రోత్సహించి రైతులకు మార్కెట్, రవాణా, నిల్వ, ప్రాసెసింగ్ వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా చర్యలు అవసరమన్నారు. రైతుల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాయలసీమ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు ప్రజలు పాల్గొన్నారు ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.