✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా
అనపర్తి, జూన్ 23 ( పున్నమి న్యూస్ ): కాకినాడ పర్యటన సందర్భంగా అనపర్తి మండలం రామవరం గ్రామానికి ఈరోజు విచ్చేసిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి చిత్రపటాన్ని మంత్రివర్యులకు అందజేసి సత్కరించారు. అనంతరం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ అంశాలపై మంత్రి గారితో చర్చించారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



