నర్సంపేట నియోజకవర్గం
నర్సంపేట మున్సిపాలిటీ
ప్రపంచ ఆదివాసుల దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ గారు
అడవి, ప్రకృతి, మట్టి పరిమళాలను కాపాడుతున్న ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు
ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అడవితో అనుబంధం, ప్రకృతితో అవినాభావ సంబంధం, మట్టి పరిమళాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఆదివాసీలు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని అన్నారు. ప్రకృతిని తల్లిగా భావించి, అడవులు, కొండలు, నదులు, వనరులను సంరక్షిస్తూ తరతరాలుగా పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం మన దేశానికి అమూల్యమైన వారసత్వమని, వారి హక్కులు, అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ప్రకృతిని కాపాడే నిజమైన రక్షకులైన ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ ప్రపంచ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి అభ్యున్నతికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో TPCC సభ్యులు పెండెం రామానంద్ గారు, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ,నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కాటా ప్రభాకర్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములకల మనీష్, కాంగ్రెస్ యువ నాయకులు మెరుగు కిరణ్, గోక వేద ప్రకాష్, షాలుమ్, కాటా అఖిల్, చీకటి శివమణి, ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు*

ఆదివాసుల దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ గారు
నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట మున్సిపాలిటీ ప్రపంచ ఆదివాసుల దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ గారు అడవి, ప్రకృతి, మట్టి పరిమళాలను కాపాడుతున్న ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అడవితో అనుబంధం, ప్రకృతితో అవినాభావ సంబంధం, మట్టి పరిమళాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఆదివాసీలు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని అన్నారు. ప్రకృతిని తల్లిగా భావించి, అడవులు, కొండలు, నదులు, వనరులను సంరక్షిస్తూ తరతరాలుగా పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం మన దేశానికి అమూల్యమైన వారసత్వమని, వారి హక్కులు, అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రకృతిని కాపాడే నిజమైన రక్షకులైన ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ ప్రపంచ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి అభ్యున్నతికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పెండెం లక్ష్మీ రామానంద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో TPCC సభ్యులు పెండెం రామానంద్ గారు, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ,నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కాటా ప్రభాకర్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములకల మనీష్, కాంగ్రెస్ యువ నాయకులు మెరుగు కిరణ్, గోక వేద ప్రకాష్, షాలుమ్, కాటా అఖిల్, చీకటి శివమణి, ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు*

