Tuesday, 22 September 2026
  • Home  
  • రాజోలులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి..
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి..

1,000 బైకులతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ భారీ ర్యాలీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మలికిపురం కేంద్రంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన సుమారు 1,000 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్‌కు జైకొడుతూ కార్యకర్తలు చేసిన నినాదాలతో మలికిపురం పరిసరాలు మార్మోగాయి. అనంతరం ఎల్.ఎస్. ల్యాండ్‌మార్క్‌లో ఏర్పాటు చేసిన సభలో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1,000 బైకులతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ భారీ ర్యాలీ

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మలికిపురం కేంద్రంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన సుమారు 1,000 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్‌కు జైకొడుతూ కార్యకర్తలు చేసిన నినాదాలతో మలికిపురం పరిసరాలు మార్మోగాయి. అనంతరం ఎల్.ఎస్. ల్యాండ్‌మార్క్‌లో ఏర్పాటు చేసిన సభలో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.