రాజన్న సిరిసిల్ల జులై 27 (పున్నమి ప్రతినిధి)
గౌరవ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో MRPS, అనుబంధ సంఘాల నూతన గ్రామ, మండల కమిటీల నిర్మాణంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంచార్జి పుట్ట రవి మాదిగ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో MRPS సీనియర్ నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. నూతన కమిటీల ఏర్పాటు, సంఘాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో MRPS ముస్తాబాద్ మండల ఇంచార్జ్ కొమ్మెట రాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.



