Monday, 27 July 2026
  • Home  
  • నెల్లూరు కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై మంత్రి నారాయణకు RTA వినతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై మంత్రి నారాయణకు RTA వినతి

ఈరోజు గౌరవ మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని వారి నివాసంలో కలిసి నెల్లూరు నగరపాలక సంస్థ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల లోటు గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా రిపబ్లిక్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాజా రహమతుల్లా గారు మాట్లాడుతూ విద్యాశాఖకు మీరిచ్చినటువంటి అమూల్యమైన సలహా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా తరగతికి 5 మంది ఉపాధ్యాయులతో మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మన నెల్లూరు నగర పాలక సంస్థలో సుమారు 34 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పడ్డాయి కానీ నెల్లూరు నగరంలోని ఈ మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో కొన్నింటిలో వందకు పైగా విద్యార్థులు ఉన్న ఒకే ఒక్క ఉపాధ్యాయునితో కొనసాగుతున్నాయి, అదేవిధంగా అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది కేవలం నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి 64 మంది SGT ఉపాధ్యాయుల కొరత ఉంది, అదేవిధంగా కొన్ని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక పాఠశాలలు ప్రారంభించి సుమారు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఆ సబ్జెక్టు నందు విద్యాబోధన జరగలేదు, ఆగస్టు 4వ తేదీ నుండి ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్రారంభం కానుంది , ఉపాధ్యాయుల కొరత ఈ విధంగా ఉంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఎంత కష్టమవుతుందో మీకు తెలియంది కాదు కావున నెల్లూరు కార్పొరేషన్ నందు ఉపాధ్యాయుల కొరత తీర్చే విధంగా అవసరమున్న చోట వెంటనే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రిపబ్లిక్ టీచర్స్ అసోసియేషన్ పక్షానా కోరడం జరిగింది. మంత్రిగారు స్పందిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు క్రెడిట్ కానటువంటి డి ఏ అరియర్స్ గురించి సీనియర్ ఉపాధ్యాయులు కమతం సుబ్బారావు గారు మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది నారాయణ గారు స్పందిస్తూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో మాట్లాడి తొందర్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో RTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా కిరణ్ కుమార్ గారూ, ఉపాధ్యాయులు M మురళి గారు, V వెంగళరావు గారు, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ వెంకటేశ్వర్లు గారు ఎన్ దీప గారు ఎస్ సౌజన్య గారు,యు లక్ష్మీ స్రవంతి గారు,విజయలక్ష్మి గారు తదితరులు పాల్గొనడం జరిగింది

ఈరోజు గౌరవ మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని వారి నివాసంలో కలిసి నెల్లూరు నగరపాలక సంస్థ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల లోటు గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా రిపబ్లిక్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాజా రహమతుల్లా గారు మాట్లాడుతూ విద్యాశాఖకు మీరిచ్చినటువంటి అమూల్యమైన సలహా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా తరగతికి 5 మంది ఉపాధ్యాయులతో మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మన నెల్లూరు నగర పాలక సంస్థలో సుమారు 34 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పడ్డాయి కానీ నెల్లూరు నగరంలోని ఈ మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో కొన్నింటిలో వందకు పైగా విద్యార్థులు ఉన్న ఒకే ఒక్క ఉపాధ్యాయునితో కొనసాగుతున్నాయి, అదేవిధంగా అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది కేవలం నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి 64 మంది SGT ఉపాధ్యాయుల కొరత ఉంది, అదేవిధంగా కొన్ని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక పాఠశాలలు ప్రారంభించి సుమారు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఆ సబ్జెక్టు నందు విద్యాబోధన జరగలేదు, ఆగస్టు 4వ తేదీ నుండి ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్రారంభం కానుంది , ఉపాధ్యాయుల కొరత ఈ విధంగా ఉంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఎంత కష్టమవుతుందో మీకు తెలియంది కాదు కావున నెల్లూరు కార్పొరేషన్ నందు ఉపాధ్యాయుల కొరత తీర్చే విధంగా అవసరమున్న చోట వెంటనే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రిపబ్లిక్ టీచర్స్ అసోసియేషన్ పక్షానా కోరడం జరిగింది. మంత్రిగారు స్పందిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది

ఈ సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు క్రెడిట్ కానటువంటి డి ఏ అరియర్స్ గురించి సీనియర్ ఉపాధ్యాయులు కమతం సుబ్బారావు గారు మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది నారాయణ గారు స్పందిస్తూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో మాట్లాడి తొందర్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో RTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా కిరణ్ కుమార్ గారూ, ఉపాధ్యాయులు M మురళి గారు, V వెంగళరావు గారు, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ వెంకటేశ్వర్లు గారు ఎన్ దీప గారు ఎస్ సౌజన్య గారు,యు లక్ష్మీ స్రవంతి గారు,విజయలక్ష్మి గారు తదితరులు పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.