పువ్వాడ నాగేంద్ర కుమార్
( పున్నమి జిల్లా రిపోర్టర్ )
ఖమ్మం మే
యూత్ డిక్లరేషన్” పేరుతో తెలంగాణ యువతకు భారీ హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు నిరుద్యోగ యువత ఆశలను వమ్ము చేస్తోందని ఖమ్మం జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, పారదర్శక నియామకాలు అంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తరువాత యువత సమస్యలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆయన విమర్శించారు. లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా, ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైందన్నారు.
యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించిన అనంతు ఉపేందర్, వెంటనే ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
“యువత నమ్మకాన్ని ద్రోహం చేసిన ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో యువతే గట్టి బుద్ధి చెబుతుంది” అని అనంతు ఉపేందర్ అన్నారు.



