యూకే: మంచి ఉద్యోగం, మెరుగైన భవిష్యత్తు కోసం యూకేకు వెళ్లిన ఓ భారతీయ యువకుడు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వీసా ఇచ్చిన సంస్థ ఉద్యోగం కల్పించకుండా మోసం చేయడంతో ఆహారం, నివాసం లేక చర్చిల్లో ఆశ్రయం పొందుతూ రోజులు గడిపాడు. అనంతరం తనను మోసం చేసిన సంస్థపై న్యాయపోరాటం ప్రారంభించాడు. కేసును విచారించిన యూకే కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, కంపెనీపై సుమారు రూ.38 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బాధితుడికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లే వారికి కీలక హెచ్చరికగా నిలిచింది.

యూకేలో మోసం.. న్యాయం గెలిచింది