Monday, 7 September 2026
  • Home  
  • యువతపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్య హత్యే.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు
- రాజన్న సిరిసిల్ల

యువతపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్య హత్యే.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ జూలై 24( పున్నమి ప్రతినిధి ) ముస్తాబాద్: ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పార్లమెంట్ ముట్టడికి వెళ్లిన యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు మరియు జిల్లా కార్యదర్శి ఎల్లా బాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో యువత తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పోలీసులతో బలప్రయోగానికి పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలపై సమాధానం చెప్పాల్సింది పోయి విద్యార్థుల గొంతును అణచివేయడం అత్యంత బాధాకరమన్నారు. లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పట్టణ, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు, జిల్లా కార్యదర్శి ఏళ్ల బాల్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రాజు రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాలంకారి శ్రీనివాస్, వైస్ చైర్మన్ రామ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ యాదగిరి గౌడ్, మాజీ సర్పంచ్ కలకొండ కిషన్‌రావు, మిడిదొడ్డి భాను, దుబ్బాక రాజు, గుండెల్లి శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ జూలై 24( పున్నమి ప్రతినిధి )

ముస్తాబాద్: ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పార్లమెంట్ ముట్టడికి వెళ్లిన యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు మరియు జిల్లా కార్యదర్శి ఎల్లా బాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో యువత తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పోలీసులతో బలప్రయోగానికి పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలపై సమాధానం చెప్పాల్సింది పోయి విద్యార్థుల గొంతును అణచివేయడం అత్యంత బాధాకరమన్నారు. లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ర్యాలీలో పట్టణ, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు, జిల్లా కార్యదర్శి ఏళ్ల బాల్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రాజు రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాలంకారి శ్రీనివాస్, వైస్ చైర్మన్ రామ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ యాదగిరి గౌడ్, మాజీ సర్పంచ్ కలకొండ కిషన్‌రావు, మిడిదొడ్డి భాను, దుబ్బాక రాజు, గుండెల్లి శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.