ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కిరణ్ గారి ఆదేశాల మేరకు, ఖమ్మం జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బండ్ల రీగన్ ప్రతాప్ ఆధ్వర్యంలో దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 15 శాతం రాజకీయ రిజర్వేషన్లను 2025 జనాభా ప్రాతిపదికన అమలు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్, ఐఏఎస్ గారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా దళితులకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పమ్మి అనిత, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బోయిల వెంకట్, రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటమర్తి సుదర్శన్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కందుల శ్రీకృష్ణ, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు దేవరకొండ కోటేశ్వరరావు, గుండె ఉపేందర్, చెరుకుపల్లి వెంకట్, ధారమ్మల ఉపేందర్, ధమాలా ప్రభాకర్, డి. రామ, తగరం శ్రీను, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.


