Wednesday, 5 August 2026
  • Home  
  • యాప్‌లతో రైతులకు తిప్పలు..!* యూరియాతో మొదలై అన్ని ఎరువుల కొనుగోలుకూ యాప్‌లేనా?*
- ఖమ్మం

యాప్‌లతో రైతులకు తిప్పలు..!* యూరియాతో మొదలై అన్ని ఎరువుల కొనుగోలుకూ యాప్‌లేనా?*

*యాప్‌లతో రైతులకు తిప్పలు..!* యూరియాతో మొదలై అన్ని ఎరువుల కొనుగోలుకూ యాప్‌లేనా?* *సాంకేతిక విధానాలతో సమయం వృథా అవుతోందని రైతుల ఆవేదన* *గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలతో ఎరువుల కొనుగోలు కష్టసాధ్యం* *రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: తెలంగాణలో యూరియా కొనుగోలు కోసం ప్రవేశపెట్టిన యాప్ వల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, ఇప్పుడు అన్ని రకాల ఎరువుల కొనుగోలును కూడా యాప్‌ల ద్వారానే నిర్వహించే విధానంపై అసంతృప్తి వ్యక్తమవుతోందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. సాగు పనులు ఉధృతంగా సాగుతున్న సమయంలో రైతులు పొలాల్లో ఉండాల్సిన అవసరం ఉందని, అలాంటి వేళ యాప్‌లు, ఇంటర్నెట్, సాంకేతిక ప్రక్రియల కోసం సమయం వెచ్చించాల్సి రావడం వల్ల వ్యవసాయ పనులపై ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక అవగాహన లోపం కారణంగా ఎరువుల కొనుగోలు ఆలస్యమవుతోందని వారు అంటున్నారు. రైతుల అవసరాలు, గ్రామీణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించాలని, కేవలం సాంకేతికతపై ఆధారపడే విధానాలను పునఃసమీక్షించాలని వారు కోరుతున్నారు. ఈ విధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల రైతుల్లో అసంతృప్తి పెరుగుతోందని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించే విధానాలను కొనసాగిస్తే తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఏకమై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

*యాప్‌లతో రైతులకు తిప్పలు..!*
యూరియాతో మొదలై అన్ని ఎరువుల కొనుగోలుకూ యాప్‌లేనా?*

*సాంకేతిక విధానాలతో సమయం వృథా అవుతోందని రైతుల ఆవేదన*

*గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలతో ఎరువుల కొనుగోలు కష్టసాధ్యం*

*రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి*

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం:

తెలంగాణలో యూరియా కొనుగోలు కోసం ప్రవేశపెట్టిన యాప్ వల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, ఇప్పుడు అన్ని రకాల ఎరువుల కొనుగోలును కూడా యాప్‌ల ద్వారానే నిర్వహించే విధానంపై అసంతృప్తి వ్యక్తమవుతోందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
సాగు పనులు ఉధృతంగా సాగుతున్న సమయంలో రైతులు పొలాల్లో ఉండాల్సిన అవసరం ఉందని, అలాంటి వేళ యాప్‌లు, ఇంటర్నెట్, సాంకేతిక ప్రక్రియల కోసం సమయం వెచ్చించాల్సి రావడం వల్ల వ్యవసాయ పనులపై ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక అవగాహన లోపం కారణంగా ఎరువుల కొనుగోలు ఆలస్యమవుతోందని వారు అంటున్నారు.
రైతుల అవసరాలు, గ్రామీణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించాలని, కేవలం సాంకేతికతపై ఆధారపడే విధానాలను పునఃసమీక్షించాలని వారు కోరుతున్నారు.
ఈ విధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల రైతుల్లో అసంతృప్తి పెరుగుతోందని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించే విధానాలను కొనసాగిస్తే తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఏకమై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.