Wednesday, 23 September 2026
  • Home  
  • యాతాలకుంట వద్ద టన్నెల్ పనులపై మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ
- ఖమ్మం

యాతాలకుంట వద్ద టన్నెల్ పనులపై మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ

సత్తుపల్లి/ ఖమ్మం సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ పరిస్థితులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు వెళ్తున్న సందర్భంగా యాతాలకుంట వద్దకు చేరుకున్న మంత్రి టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా టన్నెల్ నిర్మాణ పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. మంత్రి తుమ్మల వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇరిగేషన్ శాఖ అధికారులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తదితరులు ఉన్నారు.

సత్తుపల్లి/ ఖమ్మం

సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ పరిస్థితులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు వెళ్తున్న సందర్భంగా యాతాలకుంట వద్దకు చేరుకున్న మంత్రి టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా టన్నెల్ నిర్మాణ పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.
మంత్రి తుమ్మల వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇరిగేషన్ శాఖ అధికారులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.