ఖమ్మం
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని నాయకులు పేర్కొన్నారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్తదాతలను ఈ సందర్భంగా పార్టీ నాయకులు అభినందించారు.



