ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మోదీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజల సంక్షేమం, దేశ ప్రగతి కోసం ప్రార్థనలు చేశారు.



