*మేడిపల్లి రహదారి అభివృద్ధికి రూ.2 కోట్ల మంజూరు*
జాతీయ రహదారి NH-44 నుంచి మేడిపల్లి గ్రామానికి వెళ్లే రహదారిని డబుల్ లైన్‌గా అభివృద్ధి చేసి, మధ్యలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు *రూ.2 కోట్లు మంజూరయ్యాయి.* రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారిని కలిసి *నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు గారు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి గారు* వినతిపత్రం అందజేశారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారికి శ్రీహరి రావు, సోమ భీమ్ రెడ్డి గార్లు కృతజ్ఞతలు తెలిపారు.


