ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు రెండు కళాశాలలో తేదీ 24.07.26 గురువారం నాడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణపై కమిషనర్ వై.ఓ నందన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత విద్యాలయాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ అదనపు కమిషనర్ హిమబిందు, టి.పి.ఆర్.ఓ. వాసు బాబు, అసిస్టెంట్ కమిషనర్ రేష్మ, ఎం.ఈ.ఓ. లు మురళీధర్ రావు, తిరుపాలు పాల్గొన్నారు.

