పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
పశ్చిమబెంగాల్, అస్సాం, పాండిచ్చేరి మూడు రాష్ట్రాల లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో తిరుపతి జిల్లా నాయకులు కార్యకర్తలు సంబరాలు చేశారు. సంబరాలలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి కాయం హరినాధరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమీషా ఆధ్వర్యంలో బిజెపి మూడు రాష్ట్రాలలో ఘనవిజయం సాధించడం బిజెపి పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న బలం ఇంకోసారి రుజువైందని తెలియజేశారు. భారతదేశంలో బిజెపి పార్టీతోనే అభివృద్ధి, డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి జరుగుతుందని హిందువులు పూర్తిస్తాయిలో బిజెపి పార్టీకి మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలోనే రాష్ట్రాలు అభివృద్ధి దశలో వృద్ధి చెందుతాయని. ప్రపంచంలోనే భారతదేశానికి అత్యంత విలువలు గుర్తింపు తెచ్చిన నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు.


