📌మూడు చెక్ బౌన్స్ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష
📌ఒక్కో కేసులో ఆరు నెలల చొప్పున శిక్ష విధించిన నాయుడుపేట కోర్టు
📌రూ.22 లక్షల విలువైన చెక్కుల బౌన్స్ వ్యవహారంలో తీర్పు
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం
తిరుపతి జిల్లా నాయుడుపేటలో బాకీ మొత్తాన్ని చెల్లించకుండా చెక్కులు జారీ చేసి అవి బౌన్స్ అయిన కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితుడికి నాయుడుపేట జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష విధించింది. మూడు కేసుల్లోనూ ఒక్కో కేసుకు ఆరు నెలల చొప్పున శిక్ష విధిస్తూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి సోమవారం తీర్పు వెలువరించారు.
కేసు వివరాల ప్రకారం.. నాయుడుపేటకు చెందిన మొలకలపూడి మధుసూదన్‌రావు, లక్ష్మీనారాయణ కుమారుడు, రాగి షణ్ముఖ శ్రీనివాస్ వద్ద తీసుకున్న రుణానికి సంబంధించి రూ.12 లక్షలు, రూ.8 లక్షల విలువైన రెండు బ్యాంకు చెక్కులను ఇచ్చారు. అలాగే దాసరి పోలయ్యకు రూ.2 లక్షల విలువైన మరో చెక్కును అందజేశారు.నిందితుడు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు చెక్కులను బ్యాంకుల్లో జమ చేశారు.అయితే ఖాతాల్లో తగినంత నిధులు లేకపోవడంతో మూడు చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో షణ్ముఖ శ్రీనివాస్ రెండు చెక్కులకు సంబంధించి రూ.20 లక్షల కోసం, దాసరి పోలయ్య ఒక చెక్కుకు సంబంధించి రూ.2 లక్షల కోసం నాయుడుపేట కోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు నమోదైన మూడు చెక్ బౌన్స్ కేసులు కొంతకాలంగా కోర్టులో విచారణలో ఉన్నాయి.ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడిపై నేరం రుజువైనట్లు న్యాయస్థానం నిర్ధారించింది. దీంతో మూడు కేసుల్లోనూ ఒక్కో కేసుకు ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ పి. మీనాక్షి సుందరి తీర్పు ఇచ్చారు.బాధితులకు న్యాయం జరిగేలా తీర్పు వెలువడటంతో ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశమైందిమూడు కేసులకు సంబంధించిన చెక్కుల మొత్తం విలువ రూ.22 లక్షలుగా ఉంది.


