రాజన్న సిరిసిల్ల ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్: నాలుగో వార్డులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. వార్డు సభ్యుడు నరేష్ ఆధ్వర్యంలో మండల పరిషత్ నిధులతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు.
పాఠశాల ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తొలగడంతో పాటు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా మారనున్నాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు, ఉపసర్పంచ్ విజయ్ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


