ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 26 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం చెర్లోపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో ముళ్ల చెట్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి వీఆర్ఏకు సమాచారం అందించగా, ఆయన పోలీసులకు తెలియజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, అది పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. సుమారు 20 రోజుల క్రితమే మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ముళ్ల చెట్లలో గుర్తుతెలియని మృతదేహం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 26 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం చెర్లోపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో ముళ్ల చెట్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి వీఆర్ఏకు సమాచారం అందించగా, ఆయన పోలీసులకు తెలియజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, అది పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. సుమారు 20 రోజుల క్రితమే మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

