మునిశేఖర్ రెడ్డి మృతికి కాకాణి ఘన నివాళి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణంపై మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీ గురుమూర్తితో కలిసి మునిశేఖర్ భౌతికకాయానికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన మంచి నాయకుడిని కోల్పోయామని కాకాణి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

మునిశేఖర్ రెడ్డి మృతికి కాకాణి ఘన నివాళి
మునిశేఖర్ రెడ్డి మృతికి కాకాణి ఘన నివాళి తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణంపై మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీ గురుమూర్తితో కలిసి మునిశేఖర్ భౌతికకాయానికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన మంచి నాయకుడిని కోల్పోయామని కాకాణి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

