మర్రిపాడు మండలం మిక్సిడ్ కాలనీలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జనసేన పార్టీ మర్రిపాడు మండలాధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్కే, కన్నెమరకల ప్రసాద్, తోడేటి దంతాలు హజరత్, తోడేటి నాగార్జున, నరేష్, చిన్నా, జనసేన కన్నెమరకల వెంకటేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.



