వార్త ముఖ్యాంశాలు
- పాడేరు, నవంబర్ 21: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ కనెక్టివిటీని మెరుగుపర్చాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు.
- శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీఎస్ఎన్ఎల్, భారత్‌నెట్, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు.
- సిగ్నల్ అందని గ్రామాలు, నెట్‌వర్క్ అంతరాయాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
పాడేరు, నవంబర్ 21: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ కనెక్టివిటీని మెరుగుపర్చాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీఎస్ఎన్ఎల్, భారత్‌నెట్, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. సిగ్నల్ అందని గ్రామాలు, నెట్‌వర్క్ అంతరాయాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ సేవలు, వైద్యం, విద్య, డిజిటల్ లావాదేవీలు, అత్యవసర సమాచార మార్పిడికి మొబైల్ కనెక్టివిటీ కీలకమని పేర్కొన్నారు. ప్రతి మారుమూల గిరిజన ఆవాసానికి నాణ్యమైన నెట్‌వర్క్ అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో బీఎస్ఎన్ఎల్ విశాఖపట్నం డీజీఎం, భారత్‌నెట్ ఏజీఎం, పాడేరు పీఐయూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన