వార్త ముఖ్యాంశాలు
- అరకులోయ, నవంబర్ 21 (పున్నమి): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అరకులోయ మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో తొలిరోజు మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.
- వీటిలో సర్పంచ్ స్థానాలకు 20, వార్డు సభ్యుల స్థానాలకు 34 వచ్చాయి.
- సర్పంచ్ స్థానాలకు మాడగడలో అత్యధికంగా ఆరు నామినేషన్లు పడ్డాయి.
అరకులోయ, నవంబర్ 21 (పున్నమి): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అరకులోయ మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో తొలిరోజు మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో సర్పంచ్ స్థానాలకు 20, వార్డు సభ్యుల స్థానాలకు 34 వచ్చాయి.
సర్పంచ్ స్థానాలకు మాడగడలో అత్యధికంగా ఆరు నామినేషన్లు పడ్డాయి. సుంకరమెట్టలో మూడు; బస్కి, మాదల, పద్మాపురంలో చెరో రెండు వచ్చాయి. వార్డు సభ్యులకు బొండంలో ఎనిమిది; బస్కి, మాదలలో చెరో ఆరు; పెదలబుడులో ఐదు; మాడగడలో నాలుగు దాఖలయ్యాయి. గన్నెల, ఇరగాయి, లోతేరు, సిరగాంలో ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన