Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

నెట్ జీరో క్లీనప్ డేలో అల్లూరి విద్యాసంస్థల విశేష స్పందన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెట్ జీరో క్లీనప్ డేలో అల్లూరి విద్యాసంస్థల విశేష స్పందన

వార్త ముఖ్యాంశాలు

  • అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా నెట్ జీరో క్లీనప్ డే కార్యక్రమాన్ని శనివారం విస్తృతంగా నిర్వహించారు.
  • ప్రభుత్వం, ఫారెస్ట్ బై హార్ట్‌ఫుల్‌నెస్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా 11 కేజీబీవీలు, 10 ఆశ్రమ పాఠశాలలు, 29 గురుకుల పాఠశాలలు పాల్గొన్నాయి.
  • అరకు, చింతపల్లి క్లస్టర్లలోని 21 విద్యాసంస్థల గణాంకాల ప్రకారం 5,545 మంది పాల్గొని 717.46 కిలోల వ్యర్థాలను సేకరించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా నెట్ జీరో క్లీనప్ డే కార్యక్రమాన్ని శనివారం విస్తృతంగా నిర్వహించారు. ప్రభుత్వం, ఫారెస్ట్ బై హార్ట్‌ఫుల్‌నెస్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా 11 కేజీబీవీలు, 10 ఆశ్రమ పాఠశాలలు, 29 గురుకుల పాఠశాలలు పాల్గొన్నాయి. అరకు, చింతపల్లి క్లస్టర్లలోని 21 విద్యాసంస్థల గణాంకాల ప్రకారం 5,545 మంది పాల్గొని 717.46 కిలోల వ్యర్థాలను సేకరించారు. వీటిలో 495 కిలోల తడి, 189.80 కిలోల పొడి, 32.66 కిలోల ఇతర వ్యర్థాలు ఉన్నాయి. డుంబ్రిగూడ ఈఎంఆర్ఎస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ పరిమళ పాల్గొని పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు ఈ-వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల వేర్పాటు, పునర్వినియోగంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ ఇళ్లలో, గ్రామాల్లోనూ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణను పాటించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *