వార్త ముఖ్యాంశాలు
- అనంతగిరి మండలం పీచుమామిడి గ్రామంలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో దెబ్బతిన్న 12 నివాస గృహాల మరమ్మతుల కోసం బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
- గురువారం పాడేరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ టి.
- నిషాంతి బాధితులకు నగదు అందజేశారు.
అనంతగిరి మండలం పీచుమామిడి గ్రామంలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో దెబ్బతిన్న 12 నివాస గృహాల మరమ్మతుల కోసం బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. గురువారం పాడేరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ టి. నిషాంతి బాధితులకు నగదు అందజేశారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గత వర్షాలకు ముందే బాధితులకు తార్పాలిన్లు అందించామని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఐయూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణ పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన