చిట్వేలు: మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చిట్వేలి శాఖ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎంపిక, ప్రమాణస్వీకార కార్యక్రమం స్థానిక సాయి వికాస్ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా దొండ్లవాగు శ్రీనివాసులు, కార్యదర్శిగా రామిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ట్రెజరర్‌గా తిరుమల రెడ్డి, ఆత్మీయ సహకార అధ్యక్షుడిగా చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, గౌరవ డైరెక్టర్‌గా తిరుమల విశ్వనాథం, చైర్మన్‌గా సమ్మెట వీరాంజనేయులు, కో చైర్మన్‌గా కుంభగిరి మునిరావు, కో కన్వీనర్‌గా కరీం బాయి సాయిరాం ఎన్నికయ్యారు. అలాగే అడ్వైజర్ బోర్డు, డైరెక్టర్ బోర్డు సభ్యులుగా 20 మందిని ఎంపిక చేశారు.
నూతన కార్యవర్గ సభ్యులు మానవత సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, పేదలు, అభాగ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సంస్థ కార్యకలాపాలు, లావాదేవీల్లో పారదర్శకత పాటిస్తూ సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదును మరింత విస్తరించి, సమాజంలోని పేదలు, నిరుపేదలకు అండగా నిలవాలని నూతన కార్యవర్గానికి సూచించారు. కార్యక్రమంలో సభ్యులు కట్ట రామ్మోహన్ రావు, చౌడవరం మురళి రెడ్డి, కావేరి చంద్రతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.


