Thursday, 1 October 2026
  • Home  
  • మాధవరం-1లో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం
- కడప

మాధవరం-1లో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

సిద్దవటం మండలం మాధవరం-1 అంగన్వాడీ కేంద్రంలో గురువారం అంగన్వాడీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త సుబ్బలక్షుమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త సుబ్బలక్షుమ్మ మాట్లాడుతూ..చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, విద్య, ఎదుగుదలపై అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాలు శశికళతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.