ముధోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టనున్న 28 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. పనులకు సంబంధించి విభాగాల వారీగా సమగ్ర అంచనాలు సిద్ధం చేసి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో 28 ప్యాకేజీ పనులకు రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం భైంసాలోని తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత పదేళ్లుగా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడానికి గల కారణాలు, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలు, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు సుమారు 48 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, పనుల వారీగా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ముధోల్, తానూర్, కుభీర్ మండలాల్లోని వివిధ గ్రామాలకు 28 ప్యాకేజీ ద్వారా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
విభాగాల వారీగా పనుల అంచనాలు రూపొందించి, అవసరమైన నిధుల వివరాలతో ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. 28 ప్యాకేజీ పనులు పూర్తయితే గోదావరి జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగించి ముధోల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ అంశాన్ని పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమావేశంలో ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డీఈ నవీన్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
28 ప్యాకేజీ పనులపై ప్రత్యేక దృష్టి
ముధోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టనున్న 28 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. పనులకు సంబంధించి విభాగాల వారీగా సమగ్ర అంచనాలు సిద్ధం చేసి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో 28 ప్యాకేజీ పనులకు రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం భైంసాలోని తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత పదేళ్లుగా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడానికి గల కారణాలు, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలు, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 48 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, పనుల వారీగా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ముధోల్, తానూర్, కుభీర్ మండలాల్లోని వివిధ గ్రామాలకు 28 ప్యాకేజీ ద్వారా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. విభాగాల వారీగా పనుల అంచనాలు రూపొందించి, అవసరమైన నిధుల వివరాలతో ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. 28 ప్యాకేజీ పనులు పూర్తయితే గోదావరి జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగించి ముధోల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ అంశాన్ని పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డీఈ నవీన్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

