మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పున్నమి ప్రతినిధి – కడప
కడపలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మాజీ సైనికుల సంఘం (KDESMA), AIEXBEF ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోటి రెడ్డి సర్కిల్ నుంచి అమర్ జవాన్ సర్కిల్ వరకు మాజీ సైనికులు, వీరనారులు దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, అమర వీరులకు నివాళులర్పించారు.
సీనియర్ మాజీ సైనికులను లయన్స్ క్లబ్, కడప ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో మాజీ సైనికుల సంక్షేమం, సమస్యలపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో KDESMA, AIEXBEF, BEFI–AP ప్రతినిధులు పాల్గొన్నారు.



