హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రేణు భాటియా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ సిబ్బంది నిరసనలు చేపట్టడంతో రాజకీయ ఒత్తిడి పెరిగింది. అనంతరం ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించారు.
మహిళల గౌరవం, హక్కుల కోసం భవిష్యత్తులో కూడా పనిచేస్తానని ఆమె తెలిపారు.


