Thursday, 1 October 2026
  • Home  
  • మహిళల భద్రతకు ముప్పుగా మారితే కఠిన చర్యలు
- తూర్పు గోదావరి

మహిళల భద్రతకు ముప్పుగా మారితే కఠిన చర్యలు

రంగంపేట, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. నల్లమిల్లి అన్నపూర్ణ గార్డెన్స్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన డాక్టర్ ప్రియాంక మృతి ఘటనను ప్రస్తావించిన ఎమ్మెల్యే.. మద్యం, గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి మహిళల భద్రతకు ముప్పుగా మారే పరిస్థితులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలు సేవించి మహిళలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యసనానికి గురైన యువతను కౌన్సెలింగ్ ద్వారా తిరిగి సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి కుటుంబాలు, సమాజం సహకరించాలన్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులను ఆశ్రయించాలని కోరారు. మహిళల ఆరోగ్యం, భద్రతపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

రంగంపేట, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. నల్లమిల్లి అన్నపూర్ణ గార్డెన్స్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన డాక్టర్ ప్రియాంక మృతి ఘటనను ప్రస్తావించిన ఎమ్మెల్యే.. మద్యం, గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి మహిళల భద్రతకు ముప్పుగా మారే పరిస్థితులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలు సేవించి మహిళలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యసనానికి గురైన యువతను కౌన్సెలింగ్ ద్వారా తిరిగి సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి కుటుంబాలు, సమాజం సహకరించాలన్నారు.

మహిళల భద్రత కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులను ఆశ్రయించాలని కోరారు. మహిళల ఆరోగ్యం, భద్రతపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.