Tuesday, 15 July 2025
  • Home  
  • మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో నీచ రాజకీయం…. బాబు కోసం శ్రమిస్తానన్న శాంతి..
- Featured - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో నీచ రాజకీయం…. బాబు కోసం శ్రమిస్తానన్న శాంతి..

మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో నీచ రాజకీయం…. బాబు కోసం శ్రమిస్తానన్న శాంతి.. .. జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి) ప్రత్యర్థి పార్టీ ల మహిళలను దిగజార్చే విధంగా రాష్ట్రంలో నీచ రాజకీయం నడుస్తోందని తెలుగు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మేకపాటి శాంతి కుమారి ఆరోపించారు. మర్రిపాడు లో నిర్వహించిన దేశం నేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితులు నేడు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాల పట్ల ఆసక్తి తో వచ్చే ప్రతిపక్షాల మహిళలను తమ సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ సాధనాల ద్వారా తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారని ఈ విధానాలకు స్వస్తి పలకగలిగేది చంద్రబాబు పాలన ఒక్కటే అని శాంతి కుమారి పేర్కొన్నారు. వైసీపీ పాలనపై విమర్శలు చేసిన మహిళ లను వారి భావి స్వేచ్చ కు భంగం కలిగించే చర్యలు చేపట్టి ఎన్నో ఘోరాలకు పాల్పడ్డారని శాంతి కుమారి విమర్శించారు. . బాబు ఒక్కరే మహిళలను గౌరవించే నేత అని , తనకు రాష్ట్ర స్థాయి పదవి కల్పించి రాజకీయం లో క్రియా శ్రీలక పాత్ర పోషించాలని ఆదేశించారని శాంతి కుమారి తెలిపారు. బాబు మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని , ఎలాంటి ఇబ్బందులైన వెనుకాడేది లేదని శాంతి పేర్కొన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయగలిగిన పాలన చంద్రబాబు ఒకరి వలనే సాధ్యం అనేది ఇప్పటికే ఓటర్లకు స్పష్టత ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారిన నేపథ్యంలో వీటిని నిరసిస్తూ యమ్ యల్ ఎ మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి లు ముందుగానే తమ నిరసన వ్యక్తం చేశారని, దీని ఫలితంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ప్రభుత్వ వ్యతిరేకత నెలకొందని అన్నారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డిఫ్రభాకర్ రెడ్డి , అసెంబ్లీ అభ్యర్థులు విజయం కు కృషి చేస్తామని శాంతి కుమారి తెలిపారు.

మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో నీచ రాజకీయం….
బాబు కోసం శ్రమిస్తానన్న శాంతి..
..
జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి)
ప్రత్యర్థి పార్టీ ల మహిళలను దిగజార్చే విధంగా రాష్ట్రంలో నీచ రాజకీయం నడుస్తోందని తెలుగు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మేకపాటి శాంతి కుమారి ఆరోపించారు.
మర్రిపాడు లో నిర్వహించిన దేశం నేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితులు నేడు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాల పట్ల ఆసక్తి తో వచ్చే ప్రతిపక్షాల మహిళలను తమ సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ సాధనాల ద్వారా తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారని ఈ విధానాలకు స్వస్తి పలకగలిగేది చంద్రబాబు పాలన ఒక్కటే అని శాంతి కుమారి పేర్కొన్నారు. వైసీపీ పాలనపై విమర్శలు చేసిన మహిళ లను వారి భావి స్వేచ్చ కు భంగం కలిగించే చర్యలు చేపట్టి ఎన్నో ఘోరాలకు పాల్పడ్డారని శాంతి కుమారి విమర్శించారు.
. బాబు ఒక్కరే మహిళలను గౌరవించే నేత అని , తనకు రాష్ట్ర స్థాయి పదవి కల్పించి రాజకీయం లో క్రియా శ్రీలక పాత్ర పోషించాలని ఆదేశించారని శాంతి కుమారి తెలిపారు. బాబు మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని , ఎలాంటి ఇబ్బందులైన వెనుకాడేది లేదని శాంతి పేర్కొన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయగలిగిన పాలన చంద్రబాబు ఒకరి వలనే సాధ్యం అనేది ఇప్పటికే ఓటర్లకు స్పష్టత ఉందని అన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారిన నేపథ్యంలో వీటిని నిరసిస్తూ యమ్ యల్ ఎ మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి లు ముందుగానే తమ నిరసన వ్యక్తం చేశారని, దీని ఫలితంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ప్రభుత్వ వ్యతిరేకత నెలకొందని అన్నారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డిఫ్రభాకర్ రెడ్డి , అసెంబ్లీ అభ్యర్థులు విజయం కు కృషి చేస్తామని శాంతి కుమారి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.