నంద్యాల: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మహిళలను స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దాలని, ఒక కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.నంద్యాల పురపాలక పరిధిలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన గాలి, నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, ప్రజారోగ్యం, మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.

మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలి: కలెక్టర్ రాజకుమారి గణియా