సూళ్లూరుపేట, సెప్టెంబర్ 24, 2026:
సూళ్లూరుపేట జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు గురువారం సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 10:00 గంటలకు హోలీ క్రాస్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు.
అనంతరం బస్టాండ్ ఎదురుగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బస్టాండ్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిమానం, ఆశీస్సులు తనకు మరింత బాధ్యతను అందిస్తున్నాయని, ప్రజలకు నిరంతరం సేవ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
జనసేన నాయకులు శంకు సురేష్, ఆవుల రమణ, నారే భాస్కర్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కామిరెడ్డి కేశవరెడ్డి, సురేంద్ర, పుట్ట భాను ప్రకాష్, బాలు శెట్టి, తొప్పాని బాబు, వల్లూరు కిరణ్, బూదూరు నాగరాజు, తొండ సూర్య, తీపాలపూడి రమణ, సిరివేటి బద్రి, సిరివేటి రమణ, చిన్నా, కరికేటి కిరణ్, బన్నీ, సాగి హరి, ఈదర్ పవన్, చంద్రశేఖర్, వినోద్, తారే దిలీప్, తారే వెంకటేష్, మనోజ్, నాగేంద్ర, తిరుమల, బొల్లకాయల కిరణ్, గోపి, తాళ్ల రెడ్డిశ్రీనివాస్, శ్రీనాథ్, లిఖిత్, వీర మహిళలు మీంజూరు లత, నాగరాణి, రోహిణి, తదితరులు పాల్గొన్నారు.


