ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తత అవసరం!
విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి. అందరికీ నమస్కారములు.
24-09-26 “ఆర్నబ్” తుఫాన్, దాని ప్రభావం వలన గాలులు మరియు వర్షాలు ఉండవచ్చును. కావున విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన తగిన జాగ్రత్తలు:
1. తడిసిన కరెంట్ స్తంభాలను ముట్టుకోరాదు.
2. తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ, మోటార్లు కానీ ముట్టుకోరాదు.
3. విద్యుత్ లైన్‌కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.
4. విద్యుత్ లైన్‌కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత మీ ఊరి లైన్మన్‌కు మరియు కరెంట్ ఆఫీసుకు తెలియజేయవలెను.
5. పార్కులలో గాని, స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదు.
6. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకోరాదు.
7. బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.
8. కరెంట్‌కు సంబంధించిన వస్తువులను తడి చేతులతో ముట్టుకోరాదు.
9. చిన్న పిల్లలను కరెంట్ వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.
10. మీ ఇళ్లలో ఉతికిన బట్టలను ఇనుప తీగలపై వేయకూడదు.
11. గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.
12. ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ తీసిన తర్వాతనే వాటర్ హీటర్‌ను ముట్టుకోవాలి.
అత్యవసర సంప్రదింపు సూచన
విద్యుత్ వైర్లు తెగిపడటం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం లేదా ఇతర విద్యుత్ ప్రమాదాలు కనిపించినప్పుడు వాటిని ముట్టుకోకుండా వెంటనే సంబంధిత లైన్మన్‌కు లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి సమాచారం అందించాలి. అత్యవసర విద్యుత్ ఫిర్యాదుల కోసం 1912 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, విద్యుత్ శాఖ సూచించిన భద్రతా జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి.


