Thursday, 13 August 2026
  • Home  
  • మనుబోలులో కలెక్టర్ పల్లె వీక్షణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో కలెక్టర్ పల్లె వీక్షణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల గురువారం పల్లె వీక్షణ పర్యటన నిర్వహించారు. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును, మౌలిక వసతుల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి, వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల గురువారం పల్లె వీక్షణ పర్యటన నిర్వహించారు. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును, మౌలిక వసతుల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి, వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.