పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ సాయంత్రం దర్గామిట్ట శ్రీ వేంకటేశ్వర విద్యాలయం ఉన్నత పాఠశాల లో జరిగిన ఆరవ సాహిత్యం తో సాయంకాలం కార్యక్రమం జరిగింది. అరసం నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెరుగు రామకృష్ణ ప్రత్యేక అతిథులగా హాజరయ్యారు.
నెల్లూరు నేల మీదనుంచి వాగ్దానపు కవిగా, విమర్శకునిగా శిఖర స్థాయికి చేరుకున్న డాక్టర్ సుంకర గోపాల్ రెండవ వచన కవితా సంపుటి నీటికుండలాంటి మనిషి డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆవిష్కరణ చేశారు. దాదాపు పాతికేళ్ళ క్రితం ముగ్గురు యువకవులును వేదికకు పిలిపించి పరిచయం చేసానని వారిలో ఇవాళ గోపాల్ బలమైన తెలుగు కవిగా నిలబడ్డాడని ఆయన మరెన్నో కవితా సంపుటాలు వెలువరించాలని కోరారు. మనిషి తనం కోసం అన్వేషణ, రాజ్యం దష్టీకాలను ప్రశ్నించడం, మూలాల్ని కవిత్వీకరించడం గోపాల్ కవిత ప్రత్యేకతలు అని అన్నారు. తర్వాత పెన్నా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీధర్ ఒక కవితను, మిగతా సభ్యులు రవికుమార్, కూన అంకబాబు, గోవిందరాజు సుభద్రాదేవి, పార్లపల్లి నాగేశ్వరి , మునీంద్ర, కొల్లూరి శ్రీనివాస రావు, బొగ్గవరపు రాధాకృష్ణ మూర్తి, బ్రహ్మయ్య తదితరులు కవితల్ని విశ్లేషించి వారి నచ్చిన ఇతర కవుల గురించి వివరించారు. ఈ రకమైన కార్యక్రమాలు అధ్యయన కార్యశాల లాంటిదని అందరూ అభిప్రాయ పడ్డారు..!

మనిషి తనానికి పుస్తక రూపం -‘నీటికుండలాంటి మనిషి’
పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ సాయంత్రం దర్గామిట్ట శ్రీ వేంకటేశ్వర విద్యాలయం ఉన్నత పాఠశాల లో జరిగిన ఆరవ సాహిత్యం తో సాయంకాలం కార్యక్రమం జరిగింది. అరసం నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెరుగు రామకృష్ణ ప్రత్యేక అతిథులగా హాజరయ్యారు. నెల్లూరు నేల మీదనుంచి వాగ్దానపు కవిగా, విమర్శకునిగా శిఖర స్థాయికి చేరుకున్న డాక్టర్ సుంకర గోపాల్ రెండవ వచన కవితా సంపుటి నీటికుండలాంటి మనిషి డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆవిష్కరణ చేశారు. దాదాపు పాతికేళ్ళ క్రితం ముగ్గురు యువకవులును వేదికకు పిలిపించి పరిచయం చేసానని వారిలో ఇవాళ గోపాల్ బలమైన తెలుగు కవిగా నిలబడ్డాడని ఆయన మరెన్నో కవితా సంపుటాలు వెలువరించాలని కోరారు. మనిషి తనం కోసం అన్వేషణ, రాజ్యం దష్టీకాలను ప్రశ్నించడం, మూలాల్ని కవిత్వీకరించడం గోపాల్ కవిత ప్రత్యేకతలు అని అన్నారు. తర్వాత పెన్నా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీధర్ ఒక కవితను, మిగతా సభ్యులు రవికుమార్, కూన అంకబాబు, గోవిందరాజు సుభద్రాదేవి, పార్లపల్లి నాగేశ్వరి , మునీంద్ర, కొల్లూరి శ్రీనివాస రావు, బొగ్గవరపు రాధాకృష్ణ మూర్తి, బ్రహ్మయ్య తదితరులు కవితల్ని విశ్లేషించి వారి నచ్చిన ఇతర కవుల గురించి వివరించారు. ఈ రకమైన కార్యక్రమాలు అధ్యయన కార్యశాల లాంటిదని అందరూ అభిప్రాయ పడ్డారు..!

