మంథని, సెప్టెంబర్ 10:
మంథని పట్టణంలో క్రైస్తవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మంథని డివిజన్ పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం స్థానిక తహశీల్దార్ ఆరిఫోద్దీన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు పాస్టర్ శ్రీనివాస్ పాల్ మాట్లాడుతూ.. భవన నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అయితే అనువైన స్థలం లభించక పనులు ప్రారంభం కాలేదని, వెంటనే భూమిని గుర్తించి కేటాయించాలని కోరారు. స్పందించిన తహశీల్దార్.. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఎ. జోసెఫ్, ఎం. రామయ్య తదితరులు పాల్గొన్నారు.


