Thursday, 10 September 2026
  • Home  
  • మంత్రి లోకేష్ ఆదేశాలతో గోటేటి రామూర్తి కుటుంబానికి రెండో పెన్షన్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మంత్రి లోకేష్ ఆదేశాలతో గోటేటి రామూర్తి కుటుంబానికి రెండో పెన్షన్

*మంత్రి లోకేష్ ఆదేశాలతో గోటేటి రామూర్తి కుటుంబానికి రెండో పెన్షన్..* *రూ.15 వేల పెన్షన్ అందజేత.. వస్త్రాలు, పండ్లు అందించిన ఎమ్మెల్యే సతీమణి కమలారాణి…* పేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సతీమణి బండారు కమలారాణి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన గోటేటి రామూర్తి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సోషల్ మీడియాలో వచ్చిన సమాచారంపై మంత్రి నారా లోకేష్ స్పందించి, ఆ కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు ఇందులో భాగంగా రామూర్తి కుటుంబానికి రెండో పెన్షన్ మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు, తాజాగా రామూర్తి తల్లికి నెలకు రూ.15 వేల పెన్షన్‌ను కమలారాణి, డీఆర్డీఏ పీడీ, ఆర్డీఓల చేతుల మీదుగా అందజేశారు. మంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా రామూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన కమలారాణి వారికి వస్త్రాలు, పండ్లు అందజేసి ఆప్యాయతను చాటుకున్నారు. కుటుంబానికి ప్రభుత్వం, ఎమ్మెల్యే తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రామూర్తి కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇచ్చిన హామీ మేరకు ఇంటి నిర్మాణ పనులు చేపట్టినట్లు కమలారాణి తెలిపారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఆ కుటుంబానికి అందజేస్తామని చెప్పారు.

*మంత్రి లోకేష్ ఆదేశాలతో గోటేటి రామూర్తి కుటుంబానికి రెండో పెన్షన్..*

*రూ.15 వేల పెన్షన్ అందజేత.. వస్త్రాలు, పండ్లు అందించిన ఎమ్మెల్యే సతీమణి కమలారాణి…*

పేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సతీమణి బండారు కమలారాణి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన గోటేటి రామూర్తి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సోషల్ మీడియాలో వచ్చిన సమాచారంపై మంత్రి నారా లోకేష్ స్పందించి, ఆ కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు

ఇందులో భాగంగా రామూర్తి కుటుంబానికి రెండో పెన్షన్ మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు, తాజాగా రామూర్తి తల్లికి నెలకు రూ.15 వేల పెన్షన్‌ను కమలారాణి, డీఆర్డీఏ పీడీ, ఆర్డీఓల చేతుల మీదుగా అందజేశారు. మంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం సంతోషంగా ఉందన్నారు.

అదేవిధంగా రామూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన కమలారాణి వారికి వస్త్రాలు, పండ్లు అందజేసి ఆప్యాయతను చాటుకున్నారు. కుటుంబానికి ప్రభుత్వం, ఎమ్మెల్యే తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రామూర్తి కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇచ్చిన హామీ మేరకు ఇంటి నిర్మాణ పనులు చేపట్టినట్లు కమలారాణి తెలిపారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఆ కుటుంబానికి అందజేస్తామని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.