ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా శనివారం ప్రారంభం కానున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి రాజాం నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్లను శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరిశీలించారు.ఈ సందర్భంగా రాజాం శాసనసభ్యులు కొండ్రు మురళి మోహన్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి సమావేశమై కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.రాజాం నియోజకవర్గం నుంచి సుమారు 10 వేల మంది కార్యకర్తలు, ప్రజలు ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సభకు హాజరయ్యే వారికి అవసరమైన రవాణా, భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనపై విస్తృతంగా చర్చించి సంబంధిత బాధ్యులకు తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దాట్ల సుబ్బరాజు సూచించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు