భారత్, చైనా మధ్య వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన సంభాషణ వ్యవస్థలను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు అంశాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక సంబంధాలు వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచాలని సూచించారు. ఇరు దేశాలు పరస్పర గౌరవం, విశ్వాసం ఆధారంగా ముందుకు సాగితే ప్రాంతీయ స్థిరత్వానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల సంబంధాల సాధారణీకరణ దిశగా జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భారత్-చైనా సంభాషణ వ్యవస్థను పునరుద్ధరించాలి: వాంగ్ యీ