యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ మలిదశ ఉద్యమకారిని తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమం వందలాది తెలంగాణ ఉద్యమకారులు బెల్లి లలిత అభిమానుల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించుకోగలిగాము స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన పునాదిరాయి వేయడం తెలంగాణ ఆకాంక్షలకు ప్రతీకగా ఉద్యమకారులు భావిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ప్రతీకంగా కార్యక్రమం నిర్వహణ జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ బెల్లి లలిత ఆశయ సాధన కోసం మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమానికి బెల్లి చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా సమావేశంలో సామ మల్లారెడ్డి, బత్తులసిద్దేశ్వర్,ముక్క జాగృత్,బద్దుల అఖిల్ చంద్ర, అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్, షేక్ హమీద్ పాశ,బత్తుల శ్రీనివాస్ యాదవ్,అచ్చిన శ్రీనివాస్ బహుజన, బట్టు రామచంద్రయ్యా,కావలి యాదయ్య, కాశపాక మహేష్, మల్గ యాదయ్య, నెల్లికంటి రాఘవేంద్ర, బడుగుల నాగార్జున, బెల్లి మధుకర్,కడారి కాశీం, జూపల్లి రాములు, కుసంగి నర్సింహులు, గుత్తి శివుడు, రాసాల నరసింహ, రాసాల బాలస్వామి, రాపోలు పవన్ కుమార్, వర్రే నరసింహ, వివిధ కుల రాజ్యాధికార పార్టీల నాయకులు, అఖిల భారత బహుజనసేన, గొల్ల కురుమ డోలుదెబ్బ,శ్రీ కృష్ణ యాదవ సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక, కులసంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనారు.ఈ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ అమరవీరులకు జోహార్లు తెలుపుతూ, ఘన నివాళులు అర్పించారు…..




