భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నూతన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భద్రాచలం వారి సౌజన్యంతో నూతన సమాచార కేంద్రం వద్ద కియాస్క్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తులు ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లను సులభంగా పొందవచ్చు. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు.
Uploaded Video:


