బుచ్చిరెడ్డిపాలెం: మున్సిపాలిటీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, 108 అత్యవసర వాహన సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుల వివరాలు, ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనతో హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

బ్రేకింగ్ న్యూస్. హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!