Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బొజ్జల జయంతి కానుకగా 1,648 టిడ్కో ఇళ్ల పంపిణీ-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బొజ్జల జయంతి కానుకగా 1,648 టిడ్కో ఇళ్ల పంపిణీ-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తోందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు పేర్కొన్నారు.
  • మాజీ మంత్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 15న నియోజకవర్గంలో భారీ ఎత్తున గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
  • శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ వద్ద నిర్మించిన 1,648 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తోందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు పేర్కొన్నారు. మాజీ మంత్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 15న నియోజకవర్గంలో భారీ ఎత్తున గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ వద్ద నిర్మించిన 1,648 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. “నాన్నగారు వేసిన పునాదిని నేడు శాసనసభ్యుడిగా తన చేతుల మీదుగా పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేయడం తన యొక్క పూర్వజన్మ సుకృతమనీ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను ముందే వెల్లడిస్తామని, పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, లబ్ధిదారులు ఈ శుభకార్యానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే ఆత్మీయ ఆహ్వానం పలికారు. పేదలకు ఆత్మగౌరవాన్ని కల్పించే ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమ వివరాలు: ఏప్రిల్ 15, 2026 సమయం: ఉదయం 11:15 గంటలకు వేదిక: టిడ్కో హౌసింగ్ సముదాయం, రాజీవ్ నగర్, శ్రీకాళహస్తి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *